స్టార్ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్మిక ఫారెన్ స్లాంగ్ మాట్లాడటం, కాస్త బోల్డ్‌గా కనిపించడంతో వీడియో చక్కర్లు కొట్టింది. అయితే అది ఫేక్ వీడియో, ఏఐతో మార్పింగ్ చేశారని ఈజీగా తెలుస్తోంది. దీనిపై కేంద్ర ఐటీ శాఖతో పాటు బాలీవుడ్ లెజండ్ అమితాబ్ బచ్చన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల కట్టడికి సామాజిక మాధ్యమాలదే బాధ్యత అని ఐటీశాఖ స్పష్టం చేసింది. మరోవైపు అమితాబ్.. మార్ఫింగ్ వీడియో చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. రణ్‌బీర్ సరసన ఆమె నటించిన ‘యానిమల్’ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే అల్లు అర్జున్ – సుకుమార్‌ల పాన్ ఇండియా సినిమా ‘పుష్ప-2’లోనూ నటిస్తోన్నారు.
213
previous post