అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్ సబ్జెక్ట్ వణికిస్తోంది. వారి దేశంలో లెక్కల్లో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ నుంచి సెమీ కండక్టర్ తయారీ వరకూ ప్రతి రంగంలోనూ గణితం అవసరముంటుంది. దీంతో ఇదే తీరు కొనసాగితే రాబోయే రోజుల్లో జాతీయ భద్రతకు ముప్పు అని, ప్రపంచంతో పోటీపడలేమని ఆందోళన వ్యక్తం చేస్తోంది. లెక్కలు తెచ్చే తిప్పలను అధిగమించడానికి ఇప్పటికే ప్రత్యేక ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలోని యూనివర్సిటీల్లో మ్యాథ్స్ ఇంటెన్సివ్ సబ్జెక్టుగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివే ప్రతి ఐదుగురిలో ఒక్కరే అమెరికన్ ఉన్నారట.