ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు బిగ్ సేల్‌కు సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్స్ ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సేల్ 15వ తేదీతో ముగుస్తుంది. అమెజాన్ సేల్ ఎప్పుడు ముగుస్తుందనేది వెల్లడించలేదు. అయితే ఈ సేల్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, హోమ్ అప్లెయన్సెస్‌పై డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అమెజాన్ సేల్‌లో SBI డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్ ఉండనుంది.
మొబైల్ ఆఫర్లు అమెజాన్ సేల్‌లో ఇలా..
శాంసంగ్ M04, శాంసంగ్ M13, రియల్‌మీ నార్జో ఎన్55, రెడ్‌మీ నోట్ 12 వంటి ఫోన్లపై కిక్‌స్టార్టర్ డీల్స్‌ను లైవ్‌లోకి తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 11 ఆర్, ఐఫోన్ 13, ఐకూ నియో 7 ప్రో, మోటోరొలా రేజర్ 40 అల్ట్రా, రియల్‌మీ నార్జో 60 ప్రో, ఐకూ జడ్ 7 ప్రో, హానర్ 90 ప్రో 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. వీటితోపాటు శాంసంగ్ ఎం34, వన్ ప్లస్ నార్డ్ సీఈ3, రియల్‌మీ 60 5జీ వంటి మిడ్ రేంజ్ ఫోన్లపైనా ఆఫర్లు ఉండనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో..
ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54, పిక్సెల్ 7ఏ, పోకో ఎక్స్5 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, రెడ్‌మీ నోట్ 12 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఏ34, పోకో ఎఫ్5, శాంసంగ్ గెలాక్సీ ఏ23, ఒప్పో రెనో 10, మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా జీ54, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై గణనీయ తగ్గింపు ఉండనున్నాయి. మోటోపై సెప్టెంబర్ 28న, వివోపై 29న, ఇన్ఫీనిక్స్‌పై 30న, రియల్‌మీపై అక్టోబర్ 02న, శాంసంగ్‌పై 3న, పోకోపై 4న, గూగుల్ పిక్సెల్‌పై అక్టోబర్ 05న, రెడ్‌మీ ఫోన్లపై అక్టోబర్ 05న ఆఫర్లను ప్రకటించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.