pushpa
Home » Allu arjun- అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బన్నీ

Allu arjun- అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బన్నీ

by admin
0 comment

నిన్నట్నుంచి పుష్ప-2 ట్రెండ్ అవుతూనే ఉంది. దీనికి కారణం ఈ సినిమా నుంచి ఓ సర్ ప్రైజ్ రాబోతోందనే మేటర్. స్వయంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈరోజు పుష్పరాజ్ నుంచి సర్ ప్రైజ్ వచ్చేసింది. నిజంగానే అది ఓ సర్ ప్రైజ్ వీడియో. అందులో బన్నీ వ్యక్తిగత విషయాలతో పాటు, పుష్ప-2 అప్ డేట్స్ కూడా ఉన్నాయి.

తన ఇంటిలో కొంత భాగాన్ని పరిచయం చేశాడు అల్లు అర్జున్. తను ధ్యానం చేసే ప్రదేశం, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ లాంటివి అందులో చూపించాడు. ఆ తర్వాత పుష్ప-2 షూటింగ్ కు రెడీ అయ్యాడు. స్వయంగా తన కారులో రామోజీ ఫిలింసిటీకి వెళ్లాడు. అక్కడ దగ్గర్లో ఉన్న అభిమానుల్ని పలకరించాడు.

ఫిలింసిటీలో పుష్ప-2 కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు అల్లు అర్జున్. ఆ తర్వాత తన కారవాన్ లోకి వెళ్లాడు. పుష్ప-2 కోసం పుష్ప రాజ్ గెటప్ లోకి మారాడు. మేకప్ పూర్తయిన తర్వాత కారవాన్ నుంచి బయటకొచ్చాడు. దర్శకుడు సుకుమార్ అప్పటికే ఫుల్ సెటప్ తో సిద్ధంగా ఉన్నాడు. బన్నీకి సీన్ వివరించాడు

బన్నీ సీన్ చేసి చూపించాడు. సీన్ చాలా బాగా వచ్చింది. ఆ వెంటనే ప్యాకప్ చెప్పాడు సుకుమార్. ఇలా షూటింగ్ ఉన్న రోజు తన దినచర్య ఎలా ఉంటుందనే విషయాల్ని వీడియో రూపంలో వెల్లడించాడు అల్లు అర్జున్. నిజంగా ఇది వెరీ వెరీ స్పెషల్ వీడియో. ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాలో నటనకు గాను తాజాగా జాతీయ అవార్డ్ కూడా అందున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ రిలీజ్ చేసిన వీడియో జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏదైనా పని మొదలుపెడితే దాన్ని సాధించేవరకు వదిలిపెట్టని, మొండి పట్టుదల ఉన్న పాత్రలో పుష్ప-2 సినిమాలో కనిపిస్తానని క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links