allu
Home » అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌, రాజమౌళి

అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌, రాజమౌళి

by admin
0 comment

నేషనల్ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేశారు. 2021కి గానూ 69వ జాతీయ చలన చిత్ర అవార్డులకు ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు టాలీవుడ్ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ అవార్డు అందుకున్నారు. అయితే అవార్డు అందుకునే ముందు రెడ్‌కార్పెట్‌పై బన్నీ మాట్లాడారు. కమర్షియల్ సినిమాకు ఈ అవార్డు అందుకోవడం తనకు డబుల్ అచీవ్‌మెంట్‌ అనుభూతి ఇచ్చిందని అన్నాడు.

మరోవైపు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ (పుష్ప) అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును అలియా భట్‌ (గంగూభాయి కాఠియావాడి), కృతిసనన్‌(మిమి) అందుకున్నారు. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ‘ఉప్పెన’ సినిమాకు బుచ్చిబాబు అవార్డు అందుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఆరు నేషనల్ అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ పాపులర్ మూవీ అవార్డుతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డులు పొందింది. ఈ అవార్డు అందుకునే ముందు రాజమౌళి మాట్లాడాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుందని, ఈ కోసం మా తమ టీమ్‌ 4 సంవత్సరాలు కష్టపడిందని అన్నాడు. ఇప్పుడు జాతీయ అవార్డులతో ఆర్‌ఆర్‌ఆర్‌ గుర్తింపు మరింత పెరిగిందని చెప్పాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links