పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా… ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, శిక్షార్హం. ఎవరైనా ఇలా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎన్నికల అధికారులు గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తారు. అంతేగాక పోలింగ్ అధికారి ఆ ఓటరు ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అంటే.. ఆ ఓటు రద్దు అయినట్లే లెక్క. సో.. సోషల్‌మీడియా కోసం మన విలువైన ఓటును కోల్పోవద్దు.