ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో రామ్‌చరణ్‌

మెగా హీరో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్‌చరణ్ ప్రతిష్టాత్మకమైన స్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం సాధించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకు ఇందులో స్థానం లభించింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఇటీవల యాక్టర్స్‌ బ్రాంచ్‌లోకి కొంతమంది సభ్యులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్‌ కూడా అందులో స్థానం దక్కించుకున్నాడు. తాజాగా మరికొంతమంది ప్రతిభావంతులైన నటీనటులకు చోటు కల్పించగా.. రామ్‌చరణ్‌ కూడా ఆ జాబితాలో చేరాడు. రామరాజుగా చరణ్‌ బాణం ఎక్కు పెట్టిన సీన్లను అకాడమీ షేర్ చేసింది. మరోవైపు రామ్‌చరణ్‌కు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం