Aditya L1: సూర్యుడిపై ప్రయోగానికి తేదీ ఖరారు

ఇస్రో (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3 విజయం అందించిన రెట్టింపు ఉత్సాహంతో సూర్యుడు కోసం ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించనుంది. సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్‌ 1 (Aditya L1) ప్రయోగం చేపట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్పేష్‌ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నిలేష్‌ ఎమ్‌ దేశాయ్‌ తెలిపారు. ”సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్‌1 మిషన్‌ను చేపట్టనున్నాం. సెప్టెంబర్‌ 2న ప్రయోగం జరగనుంది. శ్రీహరికోటలోని లాంచ్‌ ప్యాడ్‌లో ఇప్పటికే శాటిలైట్‌ సిద్ధంగా ఉంది” అని ఆయన అన్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన లేదా 4వ తేదీన ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ఇస్రో అధికారి మరొకరు వెల్లడించారు.

సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్‌1ను ఇస్రో ప్రయోగించనుంది. దీనిలో భాగంగా ఓ వ్యోమనౌకను సూర్యుడు-భూమి వ్యవస్థలోని లాగ్రేంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌1) వద్ద మోహరించనున్నారు. అది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేస్తుంది. ఆదిత్య-ఎల్‌1లో భాగంగా మొత్తం ఏడు పేలోడ్‌లను పంపిస్తారు. సౌరతుఫాన్ల సమయంలో సౌర వాతావరణం ఎలా ఉంటుందో అధ్యయనం చేయనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం