afg
Home » Afghanistan vs Sri Lanka- శ్రీలంక 241 ఆలౌట్‌

Afghanistan vs Sri Lanka- శ్రీలంక 241 ఆలౌట్‌

by admin
0 comment

పుణె వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 241 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. కరుణరత్నె (15)ను ఫరూకీ ఔట్‌ చేయడంతో 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన లంక బ్యాటర్లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. అర్ధశతకాలు సాధించనప్పటికీ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఒకానొక దశలో 134/2తో శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంది. కానీ అఫ్గాన్‌ బౌలర్లు గొప్పగా పుంజుకుని 51 పరుగుల వ్యవధిలోనే అయిదు వికెట్లు పడగొట్టి దెబ్బతీశారు. దీంతో 185/7తో ఆ జట్టు కష్టాల్లో పడింది. కానీ మాథ్యూస్‌ (23), తీక్షణ (29) కీలక పరుగులు చేసి అఫ్గాన్‌కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీలంక బ్యాటర్లలో నిశాంక (46), కుశాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36) పరుగులు చేశారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూకీ నాలుగు వికెట్లు, ముజీబ్‌ రెండు, అజ్మతుల్లా, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్ తీశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links