World cup- అఫ్గానిస్థాన్‌ ఎఫెక్ట్‌.. ఇక సంచలనాలు సాధారణమే!

వన్డే వరల్డ్‌కప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. అఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్‌ చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో అఫ్గాన్‌ మూడు విజయాలు సాధించి ఏకంగా అయిదో స్థానానికి దూసుకెళ్లింది. గత రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో అఫ్గానిస్థాన్ ఒక్క విజయమే సాధించడం గమనార్హం. కానీ ఇప్పుడు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ ఏకంగా ఆరు పాయింట్లు సాధించింది. ఈ మెగాటోర్నీలో అఫ్గాన్‌ మరో మూడు లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ల్లో మరో రెండు విజయాలు సాధిస్తే అఫ్గాన్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి. అన్ని అనుకూలంగా జరిగి నాకౌట్ స్టేజ్‌కు వెళ్తే అఫ్గాన్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఈ ప్రపంచకప్‌ మరింత ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

అఫ్గానిస్థాన్‌ సెమీస్‌కు వెళ్లే ఛాన్స్‌ ఎలా ఉందంటే.. తర్వాత జరగనున్న అన్ని మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌ తప్పక విజయం సాధించాలి. దాంతో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్‌ ఏదో ఒక జట్టు పట్టికలో తమ కంటే తర్వాతి స్థానంలో నిలవాలి. అయితే అఫ్గాన్‌ కేవలం రెండు విజయాలతో 10 పాయింట్ల మాత్రమే సాధిస్తే.. సెమీస్‌ అవకాశాలు కాస్త క్లిష్టంగా మారతాయి. టేబుల్ లో దానిపై ఉన్న జట్లు కూడా 10 పాయింట్లే సాధిస్తే నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషిస్తుంది. అఫ్గాన్‌ ప్రస్తుత నెట్‌ రన్‌రేట్‌ -0.178. ఈ నేపథ్యంలో ఇతర జట్ల కంటే మెరుగైన నెట్‌రన్‌రేటును అఫ్గాన్‌ సాధించుకోవాల్సి ఉంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం