Sunaina- హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి సునైనా ఆస్పత్రిలో చేరింది. ఇంతకీ ఆమెకు ఏమైంది? ఆసుపత్రిలో ఉండడానికి కారణం ఏమిటి? చేతికి ఆ సెలైన్ ఏంటి… ముక్కుకి ఆక్సిజన్ ఏంటి?

నటి సునైనా ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు ఆమె అభిమానులను విస్మయానికి గురిచేస్తున్నాయి. చేతికి సెలైన్, ముక్కులో ఆక్సిజన్ ట్యూబ్‌ని పెట్టుకుంది. ‘థంబ్స్ అప్’ సిగ్నల్ చూపిస్తూ ఫోటోను పోస్ట్ చేసింది “నాకు కొంత సమయం ఇవ్వండి. నేను తిరిగి వస్తాను…’’ అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది షాక్ అయ్యారు. సునైనా యాక్సిడెంట్‌కి గురైందా.. లేక ఆమె ఆరోగ్యానికి ఏమైనా సమస్య వచ్చిందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

సునైనా ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లు, మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా “రెజీనా” సినిమాలో నటించింది. అందులో ఆమెది ప్రధాన పాత్ర. క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు కమిట్ అయింది. అంతలోనే ఇలా హాస్పిటల్ పాలైంది.

సునైనా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి . 2008లో విడుదలైన ‘కదలిల్ ఖల్తేన్’ అనే తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. నకుల్‌తో కలిసి సినిమాలో నటించిన ఆమె.. ఆ తర్వాత మాసిలామణిలో నటించింది. వంశం, నీర్పరవై చిత్రాల్లో సునైనా పవర్‌ఫుల్ పాత్రలు పోషించింది. తన నటనకు గాను ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత విశాల్‌తో ఓ సినిమా చేసింది. అయితే వరుసగా సినిమాల్లో నటిస్తున్నా పెద్ద హీరోలతో నటించే అవకాశం రాలేదు.

విజయ్‌కి జోడీగా ‘తేరి’ చిత్రంలో ఆమె చిన్న పాత్రలో కనిపించింది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఏ పెద్ద హీరోతో జోడీ కట్టలేదు. సునైనా పలు చిత్రాల్లో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె సినిమాల్లో కథలు చాలా బాగుంటాయి.

తెలుగులో ఆమె రాజరాజ చోర సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అందులో గృహిణిగా, యంగ్ లాయర్ గా మెప్పించింది. మళ్లీ అలాంటి మంచి పాత్రలు దొరికితే తప్ప నటించనని ఆమె ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది. గ్లామర్ రోల్స్ తనకు నచ్చవని, నటించడానికి స్కోప్ ఉండే పాత్రలతో మాత్రమే తనను సంప్రదించాలని ఆమె ఓపెన్ గా చెబుతోంది. అందుకే చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ, ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తొందరగా కోలుకొని, మళ్లీ సెట్స్ పైకి రావాలని ఆశిద్దాం.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం