Nagma:పెళ్లి చేసుకోవాలని ఉంది-నగ్మా

మాజీ హీరోయిన్, ప్రస్తుత పొలిటీషియన్ నగ్మాబ్యాచిలర్ అనే సంగతి చాలామందికి తెలియదు. అవును.. ఆమెకింకా పెళ్లి కాలేదు. దశాబ్దాల పాటు ఆమె పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సడెన్ గా తను పెళ్లికి రెడీ అని ప్రకటించింది. ఆమె వయసు 48 ఏళ్లు.

జ్యోతిక-నగ్మా సిస్టర్స్. ఈమె ఒకప్పుడు సూపర్ హిట్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే జ్యోతిక కంటే పాపులర్ నటి నగ్మా. తమిళంలో బాద్‌షా, పిస్తా, వలంతన్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో ఆమె హిట్ సినిమాల లిస్ట్ చాలా పెద్దది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి ఎంతోమంది స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నగ్మా. అప్పట్లో నగ్మా అంటే టాలీవుడ్ కు ఓ పెద్ద సెంటిమెంట్. ఆమె ఉంటే సినిమా హిట్ అని ఫీలయ్యేవారంతా.

నగ్మా 1990లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హిందీ-తెలుగు భాషల్లో అనేక చిత్రాలలో నటించింది. వలంతన్ సినిమాతో ఆమెను తమిళ సినిమాకి తీసుకొచ్చాడు దర్శకుడు శంకర్. మొదటి సినిమా హిట్ కావడంతో తమిళంలో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత సురేష్ కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన బాద్షా సినిమాతో నగ్మా స్టార్ అయిపోయింది.

తెలుగులో ఆమె పెద్దింటల్లుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వారసుడు, కొండపల్లి రాజా, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు, లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హిందీ, భోజ్ పురి సినిమాల వైపు మళ్లింది. తెలుగులో ఆమె అల్లరి రాముడు, నిను చూడక నేనుండలేను సినిమాలతో నటించడం మానేసింది. తమిళ్ లో సిటిజన్ సినిమాలో సీబీఐ ఆఫీసర్ గా నటించింది. అదే ఆమె చివరి సినిమా.

తమిళంలో తక్కువ సినిమా అవకాశాలు వచ్చినా, హిందీ, తెలుగు, మలయాళం, భోజ్‌పురి భాషల్లో చాలా సినిమాలు చేసింది నగ్మా. చివరిగా 2008లో భోజ్‌పురిలో నటించిన ఆమె, నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.

48 ఏళ్ల నగ్మాకు ఇంకా పెళ్లి కాలేదు. తాజాగా దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ప్రకటించింది. కుటుంబం, పిల్లలతో కలిసి జీవించాలని ఉందంటూ తెలిపింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం