బిడ్డకు జన్మించిన ఇలియానా

నటి ఇలియానా (Ileana) తల్లి అయ్యారు. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. చిన్నారి ఫొటోను, పేరును షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన బాబు ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని, చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

తాను తల్లి కానున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇలియానా ప్రకటించింది. గత నెల జులైలో ప్రియుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఇలియానా అతడి పేరును మాత్రం చెప్పకపోవడం గమనార్హం. ‘దేవదాస్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. గతకొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటుంది. తెలుగు తెరపై చివరిసారి రవితేజ హీరోగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ లో కనిపించింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం