397
స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. ‘కంగువా’ సినిమా సెట్‌లో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన షూట్‌లో రోప్ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి సూర్యను ఆసుప్రతికి తరలించారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సూర్యకు స్వల్ప గాయాలే అయినట్లు, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కంగువా’. దిశా పఠానీ హీరోయిన్. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 38 భాషల్లో విడుదల చేయనున్నామని ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పాడు. 3డీ, ఐమ్యాక్స్ వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉండనుంది.