చంద్రబాబు కోసం 724 కి.మీ సైకిల్‌పై వచ్చాడు!

చంద్రబాబుకు సంఘీభావంగా ఓ యువకుడు కుప్పం నుండి సైకిల్ పై బయలు దేరి రాజమండ్రికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, కనమపచ్చర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈ నెల 12న సైకిల్ పై బయలుదేరి మంగళవారం రాజమండ్రికి చేరుకున్నాడు. బెంగళూరులోని సోలార్ ఇన్వర్టర్ కంపెనీలో క్వాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న గణపతి చంద్రబాబుకు వీరాభిమాని. ఈ నెల 9న చంద్రబాబు అరెస్టు అయ్యి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారన్న విషయం తెలుసుకున్న గణపతి సంఘీభావం తెలిపేందుకు 724 కి.మీ మేర సైకిల్ తొక్కి రాజమండ్రికి చేరుకన్నాడు. చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రిలోనే బసచేస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను కలిశాడు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇంతటి అభిమానులు ఉండటం మనోధైర్యం ఇస్తోందని, మీ అభిమానం, అండదండలతోనే చంద్రబాబు బయటకు వస్తారని తెలిపారు. కుప్పం ప్రజలు తమపై చూపిస్తున్న ఆప్యాయతను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం