వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో గెలిచి అజేయంగా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టాప్-5 బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో తొలుత టీమిండియా 410 రన్స్ చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చెరో వికెట్ సాధించడం విశేషం. కోహ్లి వేసిన బంతిని షాట్‌కు ట్రై చేసిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్‌కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత స్టేడియంతా దద్దరిల్లింది. ఆందరూ నవ్వులతో సంబరాలు చేసుకున్నారు. స్టాండ్స్‌లో ఉన్న అనుష్కశర్మ అయితే ఆనందంతో కేరింతలు కొట్టింది. ఇక నెదర్లాండ్స్ ఆఖరి వికెట్‌ను రోహిత్ తీశాడు. తేజ నిడమనురు ఔట్ చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది మంది ఇండియన్ ప్లేయర్స్ బౌలింగ్ వేయడం విశేషం. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మంది బౌలర్లను వినియోగించడం 31 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1992లో న్యూజిలాండ్ ఇలా 9 మంది బౌలర్లను వినియోగించగా.. అంతకుముందు 1987 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టులో 9 మంది బౌలింగ్ చేశారు.