తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో మలుపు తిరిగింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రవళిక ఏ పోటీ పరీక్షకు హాజరుకాలేదని, గ్రూప్-2 పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు వచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తితో ఆమె చేసిన చాటింగ్‌ను గుర్తించామని, తనని మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చాటింగ్ ద్వారా గుర్తించామని చెప్పారు. శివరామ్, ప్రవళిక ఇద్దరూ నగరంలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్ కూడా దొరికిందని, న్యాయపరంగా శివరామ్‌పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి ఆధారాలు సేకరిస్తామని అన్నారు. కాగా, పేపర్ లీక్స్, వరుసగా పరీక్షలు వాయిదా పడటంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘూలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.