DREAMS: మీకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు కల వచ్చిందా?

కలలు రాని వారు ఎవరైనా ఉంటారా? ఏదో ఒక సందర్భంలో దాదాపు అందరికీ కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని కలలు మనం ఆస్వాదిస్తుంటాం, మరికొన్ని భయపడుతుంటాం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతీ కలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. భవిష్యత్తులో జరిగే వాటికి అది ఓ సూచికగా ఉంటుందని స్వప్న జ్యోతిష్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పెళ్లి అయిన మగవాళ్లకు.. వారి భార్య కలలోకి వస్తుంటారు. అది వాళ్లపై ఉన్న ప్రేమకు వస్తుంటాయనుకుంటాం. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం వాటికో లెక్క ఉంది. అదేంటో తెలియాలంటే మొత్తం చదవాల్సిందే..!

స్పప్న శాస్త్రం ప్రకారం.. కలలో భార్యను చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు. అంటే రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. అదే కలలో మీ భార్యతో మాట్లాడుతున్నారా? అలా జరిగితే భవిష్యత్తులో మీకు సమస్యలు ఎదురుకానున్నట్లు స్వప్నజ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు కల వస్తే.. ఆర్థిక నష్టానికి అతి దగ్గరలో ఉన్నట్లే. మీ వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. అయితే కలలో భార్య సంతోషంగా ఉంటే.. అది శుభసూచికం. మిమ్మల్ని ధనలక్ష్మి కరుణించినట్లే. సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కలలో భార్య బాధపడుతున్నట్లు వస్తే.. అది అశుభ సూచిక అని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఒత్తిడిలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. మరికొంత మందికి ఇద్దరు భార్యలు ఉన్నట్లు కలలు వస్తుంటాయి. అలా వచ్చిన వారు భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక నష్టాన్ని చూస్తారంటా! ఆదాయం ఆవిరై పోవడం, బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని స్వప్న జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇదంతా స్వప్న శాస్త్రం ప్రకారమే. కాగా, కలలు అనేవి మన మెదడుపై ఆ రోజు జరిగే ఒత్తిడి ఆధారంగా కలలు వస్తుంటాయని వైద్యులు చెబుతుంటారు. అంతేగాక సరైన నిద్ర లేకపోయినా కలలు ఎక్కువగా వస్తుంటాయని పేర్కొంటారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం