తెగిపోతున్న సెలబ్రిటీల బంధాలు

ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత కామనో, పెటాకులు కూడా అంతే కామన్. అయితే ఇందులో రెండు రకాలు. కొన్ని జంటలు పెళ్లి చేసుకొని విడిపోతే, మరికొన్ని జంటలు పెళ్లికి ముందే విడిపోతున్నాయి. అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విడాకుల వ్యవహారాలు చూద్దాం..

నాగచైతన్య-సమంత.. దాదాపు మూడేళ్లుగా నలుగుతున్న విడాకుల మేటర్ ఇది. వీళ్లిద్దరూ విడిపోయి చాలా కాలమైంది. కానీ వీళ్ల డివోర్స్ మేటర్ పై మాత్రం ఏదో ఒక కథనం వస్తూనే ఉంది. దీనిపై ఇటు సమంత, అటు నాగచైతన్య ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పటికప్పుడు విడాకుల మేటర్ తెరపైకి వస్తూనే ఉంది.

విడాకులకు సంబంధించి ఈమధ్య బాగా వార్తల్లో నలుగుతున్న మరో వ్యక్తి సీనియర్ నరేష్. ఈయన తన మూడో భార్యకు దూరంగా ఉంటున్నారు. అదే టైమ్ లో నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. దీంతో నరేష్ విడాకుల అంశం వివాదాస్పదమైంది. తన నిజజీవితంలోని ఘటనలతో మళ్లీ పెళ్లి అనే సినిమా తీశారు నరేష్. దీంతో ఆయన విడాకుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది.

నాగబాబు కూతురు, వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక కొణెదల కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. తాజాగా నిహారిక-చైతన్య జొన్నలగడ్డ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా ప్రకటించింది. అంతేకాదు, విడాకులు తీసుకోవడానికి ముందే తన మాజీ భర్త ఫొటోలన్నింటినీ ఇనస్టాగ్రామ్ నుంచి ఆమె డిలీట్ చేసింది.

ఇటు చిరంజీవి కూతురు శ్రీజ, హీరో కల్యాణ్ దేవ్ వ్యవహారం కూడా ఇలాంటిదే. అధికారికంగా వీళ్ల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ దాదాపు విడిపోయినట్టేనంటూ చాలా కథనాలు వచ్చాయి. దీనికితోడు కూతుర్ని మిస్ అవుతున్నానంటూ ఎప్పటికప్పుడు కల్యాణ్ దేవ్ పెడుతున్న వీడియోలు చూస్తుంటే, మేటర్ కన్ ఫర్మ్ అంటున్నారు చాలామంది.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, ఆమె భార్య కిరణ్ రావు విడిపోయారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఇద్దరూ సంయుక్త ప్రకటన చేశారు. ఇకపై తాము భార్యాభర్తలం కాదని, కొడుకు కోసం తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ప్రకటించుకున్నారు. లగాన్ సినిమా టైమ్ లో అమీర్ ఖాన్, కిరణ్ రావుకు పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో 2005 డిసెంబర్ లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2011 డిసెంబర్ లో వాళ్లకు ఆజాద్ రావ్ ఖాన్ పుట్టాడు. ఇప్పుడు విడిపోయారు.

త్వరలోనే భర్తతో కలిసి ఏడడుగులు వేస్తుందనుకున్న మెహ్రీన్ తన పెళ్లిని రద్దు చేసుకుంది. భవ్య బిష్ణోయ్ తో తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుంది. ఇకపై తనకు భవ్యకు ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పేసింది. అందరి సమ్మతంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇకపై భవ్య కుటుంబంతో తనకు సంబంధం లేదని చెప్పేసింది. అటు భవ్య కూడా దాదాపు ఇలానే ప్రకటించి పెళ్లి రద్దయిన విషయాన్ని ధృవీకరించాడు.

మెహ్రీన్ లానే రష్మిక కూడా తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుంది. కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, రష్మిక ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల అనుమతితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే రష్మిక సినిమాలతో బిజీ అవ్వడం, రక్షిత్ కు టాటా చెప్పడం చకచకా జరిగిపోయాయి.

మాజీ హీరోయిన్ మినీషా లాంబా కూడా విడాకులిచ్చింది. 2015లో రియాన్ థామ్ అనే నైట్ క్లబ్ ఓనర్ తో లవ్ లో పడింది మినీషా లాంబా. 8 నెలలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ప్రస్తుతం తను రియాన్ తో కలిసి ఉండడం లేదంటూ ప్రకటించింది మినీషా లాంబా. అలా ఒంటరిగా గడుపుతున్న ఈ బీచ్ బ్యూటీ, తను మరోసారి ప్రేమలో పడిన విషయాన్ని కూడా బయటపెట్టింది.

హీరోయిన్ ఎస్తేర్, సింగర్ నోయల్ దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు. తామిద్దరం విడాకులు తీసుకున్నామనే విషయాన్ని ఎస్తేర్, అఫీషియల్ గా వెల్లడించింది. 2019 జనవరి 3న ఎస్తేర్-నోయెల్ పెళ్లి చేసుకున్నారు. మంగుళూరులో గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్లికి రాజమౌళి కూడా హాజరయ్యాడు. అలా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట కనీసం కొన్ని రోజులు కూడా కాపురం చేయలేదట. పెళ్లయిన మరుసటి రోజు నుంచే తామిద్దరి మధ్య సర్దుబాటు సమస్యలు తలెత్తాయని, అలా కొన్ని రోజులకే విడిపోయామని సంచలన ప్రకటన చేసింది ఎస్తేర్.

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ పెళ్లి కూడా పెటాకులైంది. గతేడాది ఈమె మూడో పెళ్లి చేసుకుంది. గ్రాఫిక్ డిజైనర్ పీటర్ పాల్, వనిత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అయితే పీటర్ పాల్ తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితను పెళ్లి చేసుకున్నాడనే విషయం బయటకు రావడంతో వ్యవహారం కాస్తా వివాదాస్పదమైంది. ఆ తర్వాత పీటర్ పాల్ ను కూడా దూరం పెట్టి సోలో జీవితాన్ని గడుపుతున్నట్టు వనిత ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పీటర్ పాల్ మృతిచెందాడు.

ఈ లిస్ట్ లో నయనతారను కూడా చెప్పుకోవాలి. ప్రభుదేవాతో ఈమె వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అంతలోనే ప్రభుదేవా కుటుంబం నుంచి ఇబ్బందులు, వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో నయన్-ప్రభుదేవా పెళ్లి చేసుకోలేకపోయారు. అప్పట్నుంచి సింగిల్ గానే ఉంటున్న నయనతార, ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది.

ఇక చెన్నై బ్యూటీ త్రిష పెళ్లి కూడా చాలా ఏళ్ల కిందటే రద్దయింది. ఓ బిజినెస్ మేన్ తో ఆమె పెళ్లి కుదిరింది. కాకపోతే ఆ విషయాన్ని ఆమె అధికారికంగా బయటపెట్టలేదు. పెళ్లి పనులు మాత్రం మొదలుపెట్టుకున్నారు. అంతలోనే, ఆ పెళ్లి ఆగిపోయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు సింగిల్ గానే లైఫ్ ను నెట్టుకొస్తోంది ఈ సీనియర్ హీరోయిన్.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం