ప్రేమ కోసం తండ్రి కాళ్లు విరగొట్టించిన కుమార్తె

తన ప్రేమకు అడ్డువస్తాడని భావించిన ఓ కుమారై కిరాతకానికి పాల్పడింది. సుపారీ ఇచ్చి తండ్రి కాళ్లు విరగొట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా మధ తాలుకాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ తాలుకాలో మహేంద్రషా వ్యాపారవేత్త. ఆయన కుమారై సాక్షి. కాగా, ఆమె చైతన్య అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి ప్రేమకు తన తండ్రి వస్తాడని భావించిన సాక్షి ఓ ప్లాన్‌ వేసింది. తన తండ్రి కాళ్లు విరగొట్టించి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి నలుగురు వ్యక్తులకు రూ.60 వేల సుపారీ ఇచ్చింది.

ప్లాన్‌ ప్రకారం పుణెకు వెళ్లిన సాక్షి ఆదివారం తిరిగి మధు ప్రాంతానికి వచ్చింది. బస్సు దిగిన అనంతరం ఇంటికి తీసుకువెళ్లమని తన తండ్రికి కాల్‌ చేసింది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లేందుకు మహేంద్ర కారులో వచ్చారు. ఇంటికి వెళ్తుండగా మూత్రం వస్తుందని మార్గం మద్యలో సాక్షి కారును ఆపింది. అప్పటికే కారును అనుసరిస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్రపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. కాళ్లు విరగొట్టి, తలను గాయపరిచారు. అయితే ఆయన అరుపులను విన్న అక్కడి స్థానికులు ఆస్పుత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేయగా షాకింగ్ న్యూస్‌ తెలిసింది. బాధితుడి కుమారైనే ప్రధాన నిందితురాలని తేలింది. సాక్షి, ఆమె ప్రియుడితో పాటు దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..