Bhola Shankar: 70% కథ మార్చేశారా!

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను మెహర్ రమేష్ డైరక్ట్ చేశాడు. తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. మరి ఆ సినిమాను యాజ్ ఇటీజ్ గా తీశారా.. లేక మార్పులేమైనా చేశారా.. ఇప్పుడీ అంశంపై మెహర్ స్పందించాడు. వేదాళం కథ మాత్రమే తీసుకున్నామని స్పష్టం చేశాడు మెహర్ రమేష్. టాలీవుడ్ నేటివిటీకి, చిరంజీవి స్టార్ డమ్ కు తగ్గట్టు ఏకంగా 70శాతం కథను మార్చేశారంట. ఇదే విషయాన్ని కొన్ని రోజుల కిందట తమన్న కూడా స్పష్టం చేసింది. వేదాళంలో హీరోయిన్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని, కానీ భోళాశంకర్ లో తన కోసం పాత్ర నిడివి, స్వరూపాన్ని బాగా మార్చారని చెప్పుకొచ్చింది. భోళాశంకర్ సినిమా ఓ రీమేక్ మూవీలా కాకుండా, స్ట్రయిట్ సినిమాగా అనిపిస్తుందని చెప్పింది మిల్కీబ్యూటీ.

ఇప్పుడు ఇదే విషయాన్ని మెహర్ రమేష్ కూడా చెబుతున్నాడు. చిరంజీవి సినిమా అంటే వినోదం, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఉండాలని.. వాటిని దృష్టిలో పెట్టుకొని కథకు మార్పుచేర్పులు చేశామని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో స్క్రిప్ట్ డాక్టర్ సత్యానంద్ తోడ్పాటు చాలా ఉందని తెలిపాడు మెహర్ రమేష్. సత్యానంద్ తో పాటు, చిరంజీవి చెప్పిన మార్పుచేర్పులు కూడా సినిమాలో కనిపిస్తాయని అన్నాడు. అనీల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తుసురేష్ నటించింది. ఇక చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్న నటించింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం