సాధారణంగా నాలుగేళ్ల పిల్లలంటే.. చిన్న సైకిల్ తొక్కేందుకు నానాపాట్లు పడుతుంటారు. పడుతూ, లేస్తూ.. దెబ్బలు తగిలించుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ నాలుగేళ్ల బుడతడు మాత్రం ఏకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్-350 మోడల్ బైక్‌ను నడుపుతూ ఔరా అనిపిస్తున్నాడు. అతడి డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. తండ్రి పక్కనే వస్తూ కాస్త గైడ్ చేస్తుండగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్, యమహా బైక్‌లపై రయ్ రయ్ అంటున్నాడు. వాటితో పాటు కారునూ ఈ చిచ్చరపిడుగు నడుపుతుండే వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారుతున్నాయి. అయితే రోడ్లపై కాకుండా రద్దీలేని ప్రాంతాల్లో చిన్ననాటి నుంచే డ్రైవింగ్ స్కిల్స్ నేర్పిస్తున్న బుడతడి తండ్రిని నెటిజన్లు కొనియాడుతున్నారు.