ఈరోజు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి జేష్ఠాభిషేకం జరుగుతోంది. పైగా ఈరోజు ఆఖరి రోజు. అందుకే ఆర్జిత సేవలు రద్దు చేశారు. జేష్ఠాభిషేకం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వర్ణకవచంలో దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. మరోవైపు జేష్ఠాభిషేకం ముగింపు రోజు కావడంతో, ఈరోజు చేయాల్సిన పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేశారు.
స్వర్ణకవచంలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది టీటీడీ. ప్రస్తుతం టికెట్ లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటలు సమయం పడుతోంది.
నిన్న శనివారం శ్రీవారిని 85366 మంది భక్తులు దర్శించుకున్నారు. వీళ్లలో 48183 మంది తలనీలాలు సమర్పించారు. శనివారం హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు.