మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక అప్‌డేట్ వచ్చింది. వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ వాంగ్మూలం సమర్పించింది. గూగుల్ టేక్ అవుట్ లాంటి సాంకేతిక అంశాలపై కూడా వివరణ ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 7న దిల్లీలో షర్మిల సీబీఐకి వాంగ్మూలమిచ్చిన సంగతి తెలిసిందే.
వివేకా హత్యకు సంబంధించి తన దగ్గర ఆధారాలు లేవని, కానీ రాజకీయ కోణంలోనే జరిగి ఉండవచ్చని షర్మిల చెప్పారు. కుటుంబం బయటకు కనిపించనంత బాగోలేదని కోల్డ్ వార్ ఉండేదని అన్నారు. వివేకాకు కడప ఎంపీ సీటును ఆశించలేదని తెలిపారు. తనకి కూడా కడప రాజకీయాలపై ఆసక్తి లేదని వివేకాకు చెప్పానని ఆమె వివరించారు. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయడం వివేకాకు ఇష్టం లేదని అందుకే తనని ఒప్పించారని చెప్పారు.