Pawan Kalyan – ప్రజా క్షేమం కోసం యాగం చేసిన పవన్ కల్యాణ్

ధర్మో రక్షతి రక్షిత అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసిస్తారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధ్యకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణగావించారు. సోమవారం ఉదయం 6గం. 55 నిమిషాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టాడు. ప్రజలు ఆయురారోగ్యాలు, అఫ్లైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు.

యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, కర్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అఫ్లైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత… త్రిస్ధితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యోగపీఠంపై పరవేస్థితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం… యంత్రం.. హోమం ఆలంబనగా నేటి

ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుంది.

మంగళగిరి జనసిన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యోగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. ఈ యాగం చేపట్టిందుకు ఆదివారం సాయంత్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం – ధార్మిక చింతనను కలిగిస్తోంది.

Related posts

YCP ఎమ్మెల్సీ మూడో పెళ్లి – రెండో భార్య సాక్షి సంతకం

సీఎం జగన్ భయపడేనా?

APలో TDP-జనసేనతో BJP కలిసేనా?