వినుకొండలో ఉద్రిక్తత.. గాల్లో కాల్పులు..144 సెక్షన్‌ అమలు

పల్నాడు జిల్లా వినుకొండలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా-తెదేపా వర్గాల పరస్పర సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది. వైకాపా-తెదేపా కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీన్ని అదుపుచేయడానికి సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలుచేశారు.

తెదేపా సీనియర్‌ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని తెలుస్తోంది. వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘటనా స్థలంలోనే ఉన్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం