నగ్నంగా పూజలు.. డబ్బు వస్తుందని ఆశచూపి రేప్

మన అమాయకత్వమే ఎదుటివ్యక్తి పెట్టుబడి. నమ్మించి మోసం చేస్తారు. దీనికితోడు మూఢనమ్మకాలుంటే, మోసం చేయడం మరింత ఈజీ. గుంటూరు జిల్లాలో అదే జరిగింది. నగ్నంగా పూజలు చేస్తే, లక్షల్లో డబ్బు వస్తుందని ఆశ చూపించి, అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు ఓ నకిలీ పూజారి.

చిలుకులూరుపేటకు చెందిన ఓ మహిళకు గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామానికి చెందిన ఓ నకిలీ పూజారి పరిచయమయ్యాడు. నగ్నంగా పూజలు చేస్తే లక్షల్లో డబ్బు వస్తుందని ఆశ చూపించాడు. కమీషన్ కూడా భారీగా ఇస్తానన్నాడు. దీంతో ఆ మహిళ.. కొంతమంది అమ్మాయిల్ని నమ్మించి, తీసుకొచ్చింది.

సాధారణంగా పూజలు గుడిలో చేస్తారు, లేదంటే తంత్ర పూజలైతే నిర్మానుష్య ప్రాంతాల్లో చేస్తారు. కానీ ఈ నకిలీ పూజారి లాడ్జీల్లో మాత్రమే పూజలు చేస్తాడు. యువతుల్ని నగ్నంగా కూర్చోబెట్టి, నోటికొచ్చిన మంత్రాలు చదువుతాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిపై అత్యాచారాలు చేస్తాడు. లక్షల్లో డబ్బు వస్తుందని ఆశపడి, యువతులు ఈ పని చేశారు.

ఇలా విజయవాడ, గుంటూరు, ఒంగోలు లాడ్జిల్లో పలుమార్లు యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డాడు ఈ నకిలీ పూజారి. తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది యువతులు, దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, పక్కా ప్రణాళికతో ఓ లాడ్జిని చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న నకిలీ పూజారి, ముగ్గురు యువతుల్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..