వారం తిరిగింది, ఫ్లాప్ అయింది

అక్కినేని హీరోలకు బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. మొన్నటికిమొన్న ఏజెంట్ రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు అఖిల్. మరీ అంత కాకపోయినా, ఇప్పుడు నాగచైతన్య కూడా ఓ అట్టర్ ఫ్లాప్ డెలివర్ చేశాడు. అదే కస్టడీ. గురువారంతో ఈ సినిమా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో సినిమాకు సగం డబ్బులు కూడా రాలేదు.

తెలుగు రాష్ట్రాల్లో కస్టడీ సినిమాను 18 కోట్ల రూపాయలకు అమ్మారు. ఆంధ్రాలో ఈ సినిమా 8 కోట్ల 50 లక్షల రూపాయలకు.. నైజాంలో 7 కోట్ల 50 లక్షల రూపాయలకు.. సీడెడ్ లో 2 కోట్ల 20 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. కానీ వారం తిరిగేసరికి ఈ 3 ఏరియాల నుంచి కస్టడీ సినిమాకు కేవలం 6 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.

అంటే.. బయ్యర్లు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కురాలేదన్నమాట. దీంతో బయ్యర్లతో పాటు ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. సినిమా రిలీజై ఇప్పటికే వారం గడిచింది. మార్కెట్లో మరో సినిమా పోటీలో లేకపోయినప్పటికీ.. కస్టడీ సినిమాకు వచ్చేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ సినిమా మరో వారం నడవడం దాదాపు అసాధ్యం అంటోంది ట్రేడ్. క్లోజింగ్ నాటికి సినిమా 50శాతం నష్టం రావొచ్చని అంచనా వేస్తోంది.

నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. కీలక పాత్రల్లో అరవింద్ స్వామి, ప్రియమణి నటించారు. తమిళ్ నుంచి తెలుగులోకొచ్చి వెంకట్ ప్రభు డైరక్ట్ చేసిన ఈ సినిమా, టాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చలేదు. అటు ఈ సినిమాతో కోలీవుడ్ డెబ్యూ ఇచ్చిన నాగచైతన్య, అక్కడ కూడా సరైన రిజల్ట్ అందుకోలేకపోయాడు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

YCP ఎమ్మెల్సీ మూడో పెళ్లి – రెండో భార్య సాక్షి సంతకం

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్