ind
Home » భారతీయుడు-3 కన్ఫార్మ్‌!

భారతీయుడు-3 కన్ఫార్మ్‌!

by admin
0 comment

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కు కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్‌. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే భారతీయుడు-2తో పాటు భారతీయుడు-3 కూడా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ విషయాన్ని ‘ఇండియన్-2’లో నిర్మాణ భాగస్వామి అయిన ఉదయనిధి స్టాలిన్ చెప్పాడు. ‘ఇండియన్-2’ ఫుటేజ్ చాలా ఎక్కువగా వచ్చిందని, దీని కథ ఎక్కువ అని ఉదయనిధి చెప్పాడు. అందుకే ‘ఇండియన్-3’ కూడా వచ్చే అవకాశాలున్నాయని అన్నాడు. ఈ సినిమాకు కమల్ హాసన్ కొత్తగా 40 రోజుల డేట్లు ఇచ్చాడని తెలిపాడు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్‌-2 రిలీజ్‌ అవుతుందని ఉదయనిధి చెప్పాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links