205
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో రూ.కోటిన్నర గెలుచుకొని మహారాష్ట్ర ఎస్ఐ సోమనాథ్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే అతడిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధుల్లో ఉన్న సమయంలో బెట్టింగ్‌లో పాల్గొని నిబంధనలు అతిక్రమించడాని, రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించాడని ఎస్ఐని సస్పెండ్ చేశారు. మూడు నెలలుగా సోమనాథ్ డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఇంగ్లాండ్ – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్నారు. ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి కోటిన్నర గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన సస్పెండ్ అవ్వడంతో వారి ఆనందం ఆవిరైంది.