142
‘లియో’ ట్రైలర్ వచ్చేసింది తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లియో’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమాలో విజయ్, త్రిష, సంజయ్ దత్ లుక్ ఆకట్టుకోగా, ఎలివేషన్స్, మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
లియో సినిమా ఈనెల 19న రిలీజ్ కానుండగా.. USA ప్రీసేల్స్ అప్పుడే 5 లక్షల డాలర్ల మార్క్ దాటేసింది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది కాబట్టి, విడుదలకు ముందే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా ట్రయిలర్ తో లోకేష్ కనగరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తీయడంలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఒక్కడేనా, ద్విపాత్రాభినయం చేశాడా అనేది సస్పెన్స్.