1.7K
రూ.2వేల నోటును బ్యాంకుల్లో జమచేయడానికి, మార్చుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు మార్చుకోవడానికి నేడు, రేపు మాత్రమే సమయం ఉంది. అయితే గడువు పొడగింపుపై ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ గడువును మరికొంత కాలం పొడగించే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, రూ.2 వేల నోట్లను గతేడాది మే నెలలో ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ వరకు 93% పెద్ద నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ ఇటీవల వెల్లడించింది.