బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) షో చాలా పాపులర్. ఈ షోలో అమితాబ్ అడిగే ప్రశ్నలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. అయితే తాజాగా ముగిసిన ఎపిసోడ్ బిగ్ బీ అడిగిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ప్రశ్నేంటంటే .. టెస్టు క్రికెట్‌లో తండ్రీకొడుకులను ఔట్ చేసిన ఆటగాడు ఎవరు? క్రికెట్ ప్రేమికులకు ఇది చాలా సులువైన ప్రశ్న. కానీ ఈ ప్రశ్న ఖరీదు రూ.25 లక్షలు.
ఈ ప్రశ్నకు రవిచంద్ర అశ్విన్ (Ravichandran Ashwin), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ అని బిగ్ బీ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. అయితే దీనికి సరైన జవాబు అశ్విన్. 2011లో తండ్రి శివనారాయణ్ చంద్రపాల్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. అశ్విన్‌కు టెస్టు ఫార్మాట్‌లో అదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇటీవల జరిగిన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో శివనారాయణ్ కొడుకు అయిన తగ్‌నరైన్ చంద్రపాల్‌ను ఔట్ చేసి రికార్డు సృష్టించాడు. తండ్రీకొడుకులను ఔట్ చేసిన బౌలర్ల జాబితోలో అశ్విన్‌తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన సైమన్ హార్మర్, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ఉన్నారు.