వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సీఎం ఆగస్టు 19వ తేదీన మెదక్ జిల్లా పర్యటించాల్సి ఉంది. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలతో పాటు బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో పర్యటనను ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగస్టు 18న మొదలై ఆగస్టు 19న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , తర్వాత తగ్గుముఖం పడుతాయని వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది.