యంగ్ హీరో నాగశౌర్య చూడ్డానికి బక్కగా ఉంటాడు కానీ బుర్ర నిండా తెలివితేటలే. ఎక్కడ ఎలా ఉండాలో నాగశౌర్యకు బాగా తెలుసు. అన్నింటికి మించి తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలుసు. అందుకే రిలీజ్ కాబోతున్న రంగబలి సినిమా కోసం ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ప్రమోషనల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడు అందర్ని ఆకట్టుకుంటున్నాడు. కంటెంట్ బావుంటేనే చూస్తారని, కంటెంట్ బాగోకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఏం చేయలేడని కామెంట్ చేశాడు. తద్వారా ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ తో తాను చాలా బాధపడినట్లు చెప్పకనే చెప్పాడు. ఇక గతంలో ఓ అమ్మాయిని ఆమె బోయ్ ఫ్రెండ్ నుంచి కాపాడబోతే… తనకే సీన్ సితార్ అయ్యిందని చెప్పాడు. అందుకే అబ్బాయల్ని సెలెక్ట్ చేసుకునే ముందు అమ్మాయిలు కాస్త ఆలోచించాలని చిన్న సైజ్ క్లాస్ ఇచ్చేశాడు. అంతేనా.. గతంలోనూ కూడా ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో పవన్ కల్యాణ్ అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ఓవరాల్ గా ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఏ టైమ్ లో ఎవర్ని ఎలా సెట్ చెయ్యాలో ఈ కుర్రహీరోకి బాగా తెలుసు. అయితే పాపం నాగశౌర్యకు ఇన్ని తెలివితేటలున్నా హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఛలో సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. అలాగని సినిమాలు తీయడం లేదా అంటే.. అన్నీ జోనర్స్ టచ్ చేస్తున్నాడు. కొత్త కొత్త హీరోయిన్స్ ని సెట్ చేస్తున్నాడు. కానీ కంటెంట్ మర్చిపోతున్నాడు. అందుకే ఇప్పుడు రంగబలితో ఛలో లాంటి సూపర్ హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరి నాగశౌర్య ప్రయత్నం ఈ సారైనా ఫలిస్తుందా లేదో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.
178
previous post