adipurush pre release
Home » Adipurush – ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

Adipurush – ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

by admin
0 comment

ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం నుంచి తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేయాలని యూనిట్ భావిస్తోంది. కేవలం ఈ ఒక్క ఫంక్షన్ కోసమే దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఒక ఐదు నిమిషాలు ఆది పురుష్ కి. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలి కాలంలో జరగనున్న బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించి ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రమోషన్స్ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకి ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరెవరో కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన మత గురువు మరియు యోగి సన్యాసి అయిన చిన జీయర్ స్వామి. ఆయన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి తన దైవిక ఆశీర్వాదాలను కురిపించనున్నారట.

ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగబోతున్న మరికొన్ని విషయాల గురించి చెప్పాలి అంటే..చరిత్రలో తొలిసారిగా… ఈ ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రాముడు మరియు వేంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి యొక్క అవతారాలు కాబట్టి తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఆదిపురుష్ మరియు రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మరో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఈ ఈవెంట్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ లెవెల్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి 1 లక్ష + మంది భారీ ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నారు.

ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించే ఈ భారీ ఈవెంట్‌ను శ్రేయాస్ మీడియా ప్లాన్ చేస్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links