Tollywood-heroes-earnings
Home » సంపాదనలో కూడా తోపులు

సంపాదనలో కూడా తోపులు

by admin
0 comment

‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను టాలీవుడ్ యంగ్ హీరోలు నిజజీవితంలో ఫాలో అయిపోతున్నారు. హీరోలు సినిమాలతో వచ్చే రెమ్యూనరేషనే కాకుండా బిజినెస్ లో కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతకీ మన టాలీవుడ్ హీరోలు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు.. ఎఁత సంపాదిస్తున్నారు.. ఓ లుక్కేద్దాం.. ముందుగా రామ్ చరణ్ విషయానికొద్దాం…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి బిజినెస్ మేన్ కూడా. చరణ్ 2011 సెప్టెంబర్ లో ‘ఆర్ సీ హైదరాబాద్ పోలో & రైడింగ్ క్లబ్’ పేరిట ఒక పోలో టీమ్ ప్రారంభించాడు. గతంలో ‘మా’ టీవీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్లో లో ఖైదీ నెం. 150 సినిమాను నిర్మించాడు. తన భార్య ఉపాసనతో కలిసి హెల్త్ ప్రొడక్ట్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. 2015 ట్రూజెట్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేశాడు. వీటితో పాటు.. 34 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. చెర్రీ, ఉపాసన దంపతుల నెట్ వర్త్ 2వేల 500 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా.

ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా తక్కువోడేం కాదు. తన నటన, స్టైల్ తో అభిమానులను సంపాదించుకున్న బన్నీ.. తండ్రి అల్లు అరవింద్ బాటలో నడుస్తూ వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్, ఆహా ఓటీటీలోనూ భాగస్వామిగా ఉన్నాడు. అలాగే అల్లు రామలింగయ్య పేరు మీద ప్రొడక్షన్ ను, స్టుడియోను స్టార్ట్ చేస్తున్నాడు. ఏషియన్ గ్రూప్ వాళ్లతో కలిసి ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లో కూడా అడుగు పెట్టాడు.

బఫెల్లో వింగ్స్ అనే ఇంటర్నేషనల్ సంస్థ ఫ్రాంచైజీ కూడా కలిగి ఉన్నాడు. ఇక హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో 800 జూబ్లీ నైట్ క్లబ్ బన్నీదే. వీటితో పాటు పలు MNC కంపెనీల యాడ్స్ చేతిలో ఉన్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే, బన్నీ నెట్ వర్త్ అటుఇటుగా 370 కోట్ల రూపాయలు.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. పెట్టుబడుల్లోనూ తాను బాహుబలినే అని నిరూపించుకుంటున్నాడు. రాజుల కుటుంబంలో జన్మించిన ప్రభాస్… గోపికృష్ణ క్రియేషన్స్, UV క్రియేషన్స్ లో భాగస్వామిగా ఉన్నాడు. UV క్రియేషన్స్, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పెట్టిన అతిపెద్ద స్క్రీన్ లో కూడా ప్రభాస్ కు వాటా ఉన్నట్టు సమాచారం. ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడు. సినిమాకు అటుఇటుగా 90 నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఓవరాల్ గా ప్రభాస్ నెట్ వర్త్ 315 కోట్ల రూపాయలుగా ఉండొచ్చు.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి, కోట్ల రూపాయలు ఆర్జించిన హీరో విజయ్ దేవరకొండ. ఏషియన్ దేవరకొండ పేరుతో మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స్ థియేటర్ రన్ చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. అలాగే ‘రౌడీ వేర్’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ కూడా నడుపుతున్నాడు. అంతేకాదు, విజయ్ దేవరకొండకు ఓ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. ఈ రౌడీ హీరో ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడట. ఇతడి సంపాదన మొత్తం కలుపుకుంటే.. 40 కోట్ల రూపాయల పైమాటే.

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ సైతం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోలకు హోస్టుగా చేశాడు. ఫిజ్, లూసియస్, మలబార్ గోల్డ్, ఒట్టో, నవరత్న లాంటి ప్రొడక్ట్స్ కు ప్రచారం చేస్తున్నాడు. వీటితో పాటు సినిమాకు 45 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడనే టాక్ ఉంది. ఇవన్నీ కలిసి ఇతడి నెట్ వర్త్ అటుఇటుగా 450 కోట్లు.

ఇక మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, బిజినెస్ లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఈయన ఏషియన్ గ్రూప్స్ తో కలిసి AMB పేరిట గచ్చిబౌలిలో మాల్ కమ్ మల్టీప్లెక్స్ నెలకొల్పాడు. తన భార్య నమ్రత పేరు మీద బంజారాహిల్స్ లో ఏఎన్ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశాడు. ఇవే కాకుండా ది హంబుల్ పేరిట బ్రాండెడ్ క్లోతింగ్ షోరూం ప్రారంభించాడు. మినర్వా కాఫీ షాప్ భాగస్వామ్యంతో పాలెస్ హైట్స్ పేరిట ఓ కాఫీ షాప్ ఉంది.

GMB ప్రొడక్షన్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. థమ్సప్, పారాగాన్, రెయిన్ బో హాస్పిటల్, అభి బస్, ది చెన్నై సిల్స్, టాటా స్కై ఇలా దాదాపు 23 కంపెనీ బ్రాండ్లకు ప్రమోటర్ గా ఉన్నాడు.వీటితో పాటు సినిమాకు 50 కోట్లు తీసుకుంటాడనే టాక్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి మహేశీబాబు నెట్ వర్త్ దాదాపు 244 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా.

ఈ హీరోలతో పాటు చాలామంది హీరోలు వ్యాపారాలు చేస్తున్నారు. నటుడు నానికి వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ ఉంది. ఇక సందీప్ కిషన్, నితిన్ లాంటి చాలామంది హీరోలకు రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయి. అటు సుధీర్ బాబు కు వంశపారంపర్యంగా చాలా వ్యాపారాలున్నాయి. శర్వానంద్, రానా లాంటి హీరోలకు కూడా కొన్ని వ్యాపారాలున్నాయి. ఇలా టాలీవుడ్ లో చాలామంది హీరోలకు సొంతంగా వ్యాపారాలున్నాయి. ఓవైపు కెరీర్ ను మలుచుకుంటూనే, మరోవైపు ఇలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ రాణిస్తున్నారు మన హీరోలు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links