అతి పిన్న వయసులో అవయవాలు దానం చేసి చరిత్రలో నిలిచింది ఓ చిన్నారి. 14 నెలల చిన్నారి బ్రెయిన్ స్టీమ్ డెత్ తో మరణించి తన రెండు అవయవాలను దానం చేసి, దక్షిణ భారతదేశంలో అత్యంత చిన్న వయసులో అవయవాలు దానం చేసిన చిన్నారిగా మిగిలిపోయింది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని కొత్తపేట ప్రాంతానికి చెందిన శ్రీకాంత్, సంతోషిలకు కవలలు జన్మించారు. ఇందులో మొదటి సంతానం దేవకి శ్రీ సాయి. ఆ
కస్మాత్తుగా డిహైడ్రేషన్ కి గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స అందించిన తరువాత కూడా పరిస్థితి ఏ మాత్రం మెరుగుకాకపోవడంతో మొరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్స్ కి తరలించారు. చిన్నారిని రక్షించడానికి వైద్యులు దాదాపు మూడు రోజుల పాటు శ్రమించారు. కానీ దురుదృష్టవశాస్తూ గురువారం రాత్రి బ్రెయిన్ స్టీమ్ డెత్ తో మరణించింది.
ఆ తర్వాత అవయవదానంపై కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయ కర్తలు, చిన్నారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అవగాహన కల్పించారు. అనంతరం తల్లిదండ్రులు, కుటంబ సభ్యుల అంగీకారంతో కిడ్నీలు, కళ్లు దానం చేశారు. చనిపోతూ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్నారి తండ్రి ఆమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు, తల్లి గృహణి, 14 నెలల చిన్న చెల్లెలు ఉన్నారు. జీవన్‌ధాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.