251
టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌ను మైదానంలో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే. పంత్ కోలుకోవడానకి చాలా రోజులు పడుతుందని సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ చెప్పాడు. ప్రపంచకప్‌తో పాటు వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ పంత్ ఆడటం కష్టమేనని ఇషాంత్ అన్నాడు. గతేడాది కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
”వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ పంత్ ఆడతాడని నేను భావించట్లేదు. ఎందుకంటే అతడికి తగిలింది చిన్న గాయాలు కాదు, తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతడు మరోసారి సర్జరీకి వెళ్లకపోవడం కాస్త సానుకూలాంశం. ఇంకోసారి సర్జరీకి వెళ్తే అతడు మైదానంలో అడుగుపెట్టడానికి మరింత ఆలస్యం అవుతుంది” అని ఇషాంత్ పేర్కొన్నాడు.