Actress Sandhya is in trouble with her resort case
Home » హీరోయిన్ సంధ్య రిసార్ట్ లో పాడుపని

హీరోయిన్ సంధ్య రిసార్ట్ లో పాడుపని

by admin
0 comment

నటి సంధ్య గుర్తుందా.. భరత్ నటించిన ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఆమె. ఆ తర్వాత ఓ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలిగా కూడా నటించింది. తమిళ్ లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అటు కన్నడలో కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది. దివంగత నటుడు డా. విష్ణువర్ధన్ చివరి చిత్రం “ఆప్తరక్షక్” చివరి చిత్రంలో నాగవల్లి పాత్రను పోషించింది సంధ్య. మరియు ప్రస్తుతం సంధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటూనే తన వైవాహిక జీవితం, వ్యాపారాల్లో బిజీగా ఉంది. ఇప్పుడు సంధ్యకు చెందిన రిసార్ట్‌ వార్తల్లో నిలిచింది. ఆ రిసార్ట్ లో ఓ పాడు పని జరిగింది.

రూమ్ బాయ్ నీచత్వం వల్ల సంధ్య రిసార్ట్ కి చెడ్డ పేరు వచ్చింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పరమకుడిలోని బీచ్ పక్కనే సంధ్య, ఆమె భర్త వెంకటేష్‌కి చెందిన పెరల్ బీచ్ అనే రిసార్ట్ ఉంది. అక్కడికి రామచంద్రన్, అతని స్నేహితురాలు వచ్చారు. ఇద్దరూ విడివిడిగా 2 రూమ్స్ తీసుకున్నారు. రిసార్ట్ లో ఇద్దరూ మద్యం సేవించి ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు.

ఆ సమయంలో రిసార్ట్‌లో ఉన్న రూమ్ బాయ్ సుభాష్, స్పేర్ కీ తీసుకొని గదిలోకి ప్రవేశించాడు. వారిద్దరూ మద్యం తాగి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించాడు. రామచంద్రన్ ప్రియురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు సుభాష్. తాగిన మైకంలో ఏం జరుగుతుందో స్నేహితురాలికి తెలియలేదు. దీంతో సుభాష్ మరింత రెచ్చిపోయాడు. తనపై లైంగిక దాడి జరుగుతున్న విషయాన్ని రామచంద్రన్ స్నేహితరాలు గుర్తించింది. వెంటనే కేకలు వేసింది. దీంతో భయాందోళనకు గురైన సుభాష్ ఏం చేయాలో తెలియక మంచం దిగి పరుగులు పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన రామచంద్రన్, సుభాస్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links