anasuya
Home » Anasuya – అనసూయ ఆ గ్యాప్ ను భర్తీ చేస్తుందా?

Anasuya – అనసూయ ఆ గ్యాప్ ను భర్తీ చేస్తుందా?

by admin
0 comment

ఒకప్పుడు హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉండేదో, వాళ్లతో సమానంగా వ్యాంప్ పాత్రలకు కూడా అంతే క్రేజ్ ఉండేది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, డిస్కో శాంతి లాంటి తారలు హీరోయిన్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ మాటకొస్తే, కొంతమంది హీరోయిన్ల కంటే వీళ్లకే ఎక్కువ క్రేజ్ ఉండేది. 80ల్లో, 90ల్లో.. వీళ్ల కోసం సినిమాలకు వెళ్లే జనాలు కూడా ఉండేవారు.

అయితే రానురాను సినిమాల్లో ఈ తరహా పాత్రలు తగ్గిపోయాయి. దీంతో ఇలాంటి వాళ్లకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమధ్య ముమైత్ ఖాన్, ఈ స్థానాన్ని కొంత భర్తీచేసే ప్రయత్నం చేసింది. ఆ దిశగా ఆమె సక్సెస్ కూడా అయింది. ఆ తర్వాత, అంతకుముందు కొంతమంది ఈ గ్యాప్ లోకి ఎంటరవ్వడానికి ప్రయత్నించారు. కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు అనసూయను ఆ కోణంలో అంతా చూస్తున్నారు. సినిమాల్లో ఈ తరహా హాట్ రోల్స్ కు అనసూయ సరిగ్గా సూట్ అవుతుంది.

తాజాగా వచ్చిన విమానం సినిమాలో ఆమె పోషించిన సుమతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో వేశ్వ పాత్రలో నటించిన అనసూయ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఈ తరహా హాట్ పాత్రలు, వ్యాంప్ రోల్స్ కు అనసూయ సరిగ్గా సూట్ అవుతుందనే చర్చ మొదలైంది.

అయితే అనసూయ ఆలోచనలు మాత్రం ఇలా లేవు. ఏదో ఒక ఇమేజ్ కు పరిమితమైపోవడం ఆమెకు ఇష్టం లేదు. బుల్లితెరపై హాట్ గా కనిపిస్తూ యాంకరింగ్ చేయడంలో పెద్దగా కొత్తదనం ఉండదు. అదే వెండితెరపై అయితే ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. సరిగ్గా ఇదే యాంగిల్ లో ఆలోచిస్తోంది అనసూయ. ఇప్పటికే రంగమ్మత్తగా బీభత్సంగా క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటీ, కెరీర్ లో ఓ నెగెటివ్ రోల్ కూడా చేసింది.

ఆ క్రమంలోనే కాస్త వైవిధ్యంగా ఉండడం కోసం విమానం సినిమాలో సుమతి పాత్ర పోషించింది. ఆమె కొంచెం తన మైండ్ సెట్ మార్చుకుంటే మాత్రం, వెండితెరపై వ్యాంప్ పాత్రలకు అనసూయకు తిరుగులేదు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links