ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. దీనికి గాండీవధారి అర్జున అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం యూనిట్ బుడాపెస్ట్ లో ఉంది. ఈరోజు నుంచి సినిమాకు సంబంధించి ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.
ఇందులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అర్జున్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా కోసం దృఢంగా తయారవ్వడంతో పాటు రైఫిల్ షూటింగ్, యాక్షన్ ట్రైనింగ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఇక బుడాపెస్ట్ షెడ్యూల్ విషయానికొస్తే, ఈ షెడ్యూల్ లో భారీ ఛేజ్ సన్నివేశాలు తీయబోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల గురించి ఈ సినిమాలో చర్చిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల మానవజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని ఇందులో చూపించబోతున్నారు. దీనికి యాక్షన్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. బుడాపెస్ట్ షెడ్యూల్, ఈ నెలాఖరు వరకు జరుగుతుంది.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై తెరకెక్కుతోంది గాండీవధారి అర్జున. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.