poonam ustad
Home » Poonam Kaur – పూనమ్ కౌర్ పూనకాలు

Poonam Kaur – పూనమ్ కౌర్ పూనకాలు

by admin
0 comment

మొన్నటికిమొన్న విజయ్ దేవరకొండ పోస్టర్ పై అనసూయ చేసిన రచ్చ గురించి అంతా చూశాం. పోస్టర్ లో ‘ది’ అనే టైటిల్ వాడకాన్ని అనసూయ ఎత్తిచూపించింది. అంత అవసరమా అన్నట్టు ఎద్దేవా చేసింది. ఇప్పుడు మరో పోస్టర్ పై రచ్చ మొదలైంది. ఈసారి ఏకంగా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని మొదలుపెట్టిన నటి పూనమ్ కౌర్.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఈరోజు పొద్దున్న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కింద ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ప్రింట్ చేశారు. దీనిపై పూనమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పవన్ కాళ్ల కింద భగత్ సింగ్ అనే పేరు పెట్టడం ఏమాత్రం బాగాలేదని స్పందించింది. భగత్ సింగ్ లాంటి యోధుడి పేరును పవన్ కాళ్ల కింద పెట్టడం నిర్లక్షమా, అహంకారమా అని ప్రశ్నించింది పూనమ్. విప్లవకారుల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించొద్దంటూ ట్వీట్ చేసింది.

పూనమ్ ట్వీట్ పై పెనుదుమారం రేగింది. పవన్ ఫ్యాన్స్ అంతా పూనమ్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. దాన్ని టైటిల్ గా మాత్రమే చూడాలని కొందరు సూచిస్తే, మరికొంతమంది మాత్రం పవన్ ను విమర్శించడానికి పూనమ్ కు ఇంతకంటే మంచి టాపిక్ దొరకలేదా అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు యూనిట్ మాత్రం వెంటనే ఎలర్ట్ అయింది. పవన్ కాళ్ల కింద టైటిల్ పెడుతూ నిన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, ఈరోజు వెంటనే తప్పు దిద్దుకున్నారు. టైటిల్ ను కింద కాకుండా పక్కన వచ్చేలా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

తాజాగా ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. హరీశ్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links