అవసరమైతే TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక గురించి కేటీఆర్ మాట్లాడారు. ఆమె విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రవల్లిక తల్లిదండ్రులు తనని కలిశారని, ఓ ఆకతాయి వల్లే ప్రవల్లిక మరణించిందని చెప్పారని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రవల్లిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మరోవైపు విపక్షాలను కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. భాజపా, కాంగ్రెస్‌ను గెలిపిస్తే 50 ఏళ్లు వెనక్కి వెళ్తామని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో మార్పులు వచ్చాయని, కరీంనగర్‌లో అభివృద్ధి పనులు పూర్తిచేశామని, తాగునీటి సమస్య పరిష్కరించామని వివరించారు.
326
previous post