363
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పకర్లేదు. భారీ ట్రాఫిక్‌లో గంటలపాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే భారీ ట్రాఫిక్ జామ్‌లోనూ ఇద్దరు డెలివరీ బాయ్స్ ఆన్‌టైమ్‌కు పిజ్జా అందించారు. అది కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కార్ వద్దకు వచ్చి మరీ పిజ్జాను ఇచ్చారు. లైవ్ లొకేషన్ సహాయంతో ట్రాక్ చేస్తూ అందించారు. దీనికి సంబంధించిన వీడియోను పిజ్జా ఆర్డర్ చేసిన వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వరల్డ్ బెస్ట్ డెలివరీబాయ్స్ అంటూ కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.