ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబరు 22న విడుదల కానుంది. డిసెంబరు 1న ట్రైలర్ విడుదల చేయనున్నారు. అయితే ట్రైలర్ విడుదలకు సలార్ మేకర్స్ డిఫ్రెంట్‌గా ప్రమోషన్స్ షురూ చేశారు. ఐపీఎల్‌లో మోస్ట్ క్రేజ్ ఉన్న ఆర్సీబీతో ప్రమోషన్ స్టార్ చేశారు. విరాట్ కోహ్లి తన జెర్సీ నంబర్‌ను చూపిస్తున్న ఫొటోను ఉపయోగించి.. మరో 18 రోజుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ కానుందని ఆర్సీబీ తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టర్‌లో కోహ్లి, ప్రభాస్‌తో పాటు హైదరాబాద్ పేసర్ సిరాజ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ కూడా ఉన్నారు. కేజీఎఫ్-2 రిలీజ్ టైమ్‌లోనూ ఆర్సీబీతో టై అప్ అయిన సంగతి తెలిసిందే.
276
previous post