టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇకపై అంతర్జాతీయ టీ20లకు ఆడడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌పై ఫుల్ ఫోకస్ పెట్టడం కోసం అతడు టీ20లకు దూరమయ్యాడు. అయితే భవిష్యత్‌లో కూడా అతడు టీ20లకు ఆడే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని వన్డే వరల్డ్ కప్ ముందే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో తెలిపాడని చెప్పాయి. కుర్రాళ్ల అవకాశానికి అడ్డంకిగా మారొద్దని రోహిత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని, టెస్టులపై ఫోకస్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. 2025లో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు విరాట్ కోహ్లి టీ20 ఫార్మాట్ పై ఏ నిర్ణయం తీసుకుంటాడా అనే చర్చ మొదలైంది. అయితే టీ20లు ఆడాలా వద్దా అనే విషయంపై రోహిత్, కోహ్లికి బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తాజా సమాచారం. మరి కోహ్లి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి! ప్రస్తుతం రోహిత్ కు 36 ఏళ్లు, కోహ్లికి 35 ఏళ్లు.
425
previous post