rahul
Home » Rahul Gandhi- రైలులో రాహుల్‌ గాంధీ సర్‌ప్రైజ్‌

Rahul Gandhi- రైలులో రాహుల్‌ గాంధీ సర్‌ప్రైజ్‌

by admin
0 comment

భారత్ జోడో యాత్ర నుంచి ప్రజలతో మమేకం అవుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రైలులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగాంగా పర్యటిస్తున్న రాహుల్.. బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు ట్రైన్‌లో ప్రయాణించారు. దాదాపు 110 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ఆయన ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక్కసారిగా రాహుల్ గాంధీ రైలులో ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారు. ఆయనతో సెల్ఫీల కోసం ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. వీడియోలో ఆయన స్లీపర్ కోచ్‌లో ప్రయాణికుల మధ్య నడుచుకుంటూ కనిపించారు.

అంతకుముందు రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వ గృహ న్యాయ సదస్సు కార్యక్రమంలో పాల్గొనేందుకు బిలాస్‌పూర్ జిల్లాలోని తఖత్‌పూర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పర్సదా గ్రామానికి వచ్చారు. అక్కడ సమావేశంలో ప్రసంగించిన అనంతరం బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రాయ్‌పూర్ వెళ్లేందుకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రాహుల్ గాంధీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా, రాష్ట్ర పార్టీ చీఫ్ దీపక్ బైజ్‌తో పాటు ఇతర నేతలు కూడా రైలులో ప్రయాణించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links