212
మహానటుడు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. బసవతారక రామ్ క్రియేషన్స్ పతాకంపై ‘బ్రీత్’ సినిమాలో చైతన్యకృష్ణ కథానాయకుడిగా నటించారు. వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకు దర్శకుడు. వైదిక సెంజలియా హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం.. మరోవైపు హీరో పేషెంట్‌లా అదే ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు.. ఇలా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్‌లో చైతన్యకృష్ణ ఇంటెన్స్, డైనమిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయమవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.