సంపూర్ణేశ్ బాబు ప్రధానపాత్రలో మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రం ‘సోదరా’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అనంతరం అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడాడు. ”బ్రదర్స్ రిలేషనిషిప్ చాలా ఇంపార్టెంట్. బ్రదర్స్ మధ్యలో ఇగోలు అసలు ఉండకూడదు. డబ్బు సమస్యలు రాకూడదు. ఎప్పుడైనా సమస్యలు వచ్చాయంటే వారిద్దరు కూర్చొని మాట్లాడుకోలేదని అర్థం. అవసరమైతే ఒకరు తగ్గేలా ఉండాలి. అప్పుడే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది” అని మనోజ్ అన్నాడు. అయితే మనోజ్ మాటలు గతంలో జరిగిన వివాదం గురించి ఇండైరెక్ట్‌గా చెప్పాడని నెట్టింట్లో చర్చ సాగుతోంది. ఈ ఏడాది మార్చిలో మంచు బ్రదర్స్ వివాదం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మంచు విష్ణు గొడవపడుతున్న వీడియోను మనోజ్ సోషల్‌మీడియాలో పెట్టి.. ఇళ్లల్లోకి వచ్చి ఇలా దాడికి దిగుతుంటారంటూ రాసుకొచ్చాడు. తర్వాత వీడియోను డిలీట్ చేశాడు.
1.1K
previous post